కంకిపాడులోని పెనమలూరు నియోజకవర్గ కార్యాలయంలో గురువారం సీపీఐ శతాబ్ది ఉత్సవాలను సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నార్ల వెంకటేశ్వరరావు సారధ్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జెండాను జిల్లా కార్యదర్శి టి. తాతయ్య ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం నేత వెలగపూడి ఆజాద్, నియోజకవర్గ కార్యదర్శి మున్నంగి నరసింహారావు, సీనియర్ నేతలు మిక్కిలినేని రాధా తదితరులు పాల్గోన్నారు.