చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
ఈ మేరకు గురువారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఫోకస్ పెట్టిందని ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు చేపట్టిందని తెలిపారు.