పెనమలూరు: కాలేజీ హాస్టల్‌‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

72చూసినవారు
పెనమలూరు: కాలేజీ హాస్టల్‌‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
పెనమలూరు నియోజకవర్గం కానూరు ఎన్‌ఆర్‌ఐ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్ఆర్‌ఐ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం తోట్లవల్లూరు మండలం గురువిందపల్లి గ్రామానికి చెందిన గుర్రం వేణు నాథ్(18) మంగళవారం ఉదయం హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రేమ వ్యవహారమే కారణంగా ఎన్‌ఆర్‌ఐ సిబ్బంది వెల్లడించింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా దొరికినట్లు వారు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు ఆ లేటర్‌లోని చేతిరాత తమ అబ్బాయిది కాదని ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్