తుఫాన్ అలర్ట్ నేపథ్యంలో కంకిపాడు మండలం రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ధాన్యం రైస్ మిల్లులకు తరలింపు కోసం యుద్ధ ప్రాతిపదికన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం దావులూరు టోల్ ప్లాజా వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అధికారులు వాహనాలను దగ్గరుండి మరి సరఫరా చేశారు. కంకిపాడు తహసీల్దార్ భావన్నారాయణ, ఉయ్యూరు తహసీల్దార్ సురేష్ కుమార్, మోటార్ వాహన ఇన్ స్పెక్టర్ సుబ్బారావు సిబ్బంది పాల్గొన్నారు.