పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులోని జి3 శ్రీనివాస థియేటర్లో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని గురువారం ఉయ్యూరు టౌన్ పోలీసులు నోటీస్ జారీ చేశారు. గేమ్ చేంజర్ సినిమా విడుదల సందర్భంగా ఎటువంటి సంఘటనలు తల ఎత్తకుండా ఉండటం కోసం అన్ని చర్యలు చూసుకోవాలని కోరారు.