పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని టోల్ గేట్ వద్దనున్న బాలాజీ రైస్ మిల్లులోని ధాన్యం తరలింపును బుధవారం కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. వాతావరణ దృష్ట్యా కల్లాలో ఉన్న ధాన్యాన్ని త్వరగా జీపీఎస్ లేకున్న రైతులకు ఇబ్బంది లేకుండా తరలించాలని కలెక్టర్ మిల్లు యాజమాన్యానికి సూచించారు. కలెక్టర్ డీకే బాలాజీ వెంట కంకిపాడు తహసీల్దార్ భావనారాయణ తదితరులు ఉన్నారు.