పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం తెన్నేరు గ్రామంలోని తిరుపతమ్మ తిరునాళ్ళు శుక్రవారంతో ముగియనున్నాయి. గురువారం ఎడ్లబండిపై ప్రభలు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. ఈడుపుగల్లుకి చెందిన ప్రభ శుక్రవారం ఊరేగింపుగా రానుంది. ప్రభ ఉత్సవంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొననున్నారు.