పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం విరుచుకుబడి ఘన విజయాన్ని సాధించాలని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా శనివారం కానూరు వెలగపూడి స్టోరేజ్ నుంచి పోరంకి వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాశ్మీర్లో అమాయకులైన ప్రజలను ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా చంపేశారన్నారు. వారికి భారత సైన్యం తగిన గుణపాఠం చెప్పిందన్నారు.