జర్నలిస్తులకు అవసరమైన అన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జర్నలిస్ట్ సంఘాల నాయకుల సమావేశంలో పార్ధసారధి మాట్లాడుతూ జర్నలిస్తుల భీమా 10 లక్షలకు పెంచే యోచనతో పాటు అక్రీడిటేషన్ ల ప్రక్రియ పూర్తి అవ్వగానే ఇళ్ల స్థలాల విషయంలో కూడా సానుకూల నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.