మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం తాడిగడప మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పెనమలూరు మండలం సిఐటియు కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తులు మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ నెల సమ్మె కాలం జీతం, అలాగే 2024జనవరి నెల సంక్రాంతి పండగ బోనస్సు, అలాగే 2024 ఫిబ్రవరి నెల హెల్త్ అలవెన్స లు కార్మికులకు రావాల్సి వుందని తెలిపారు.