రోడ్డుపై చిన్నారి ప్రాణాలు చేజారే లోపే డ్రైవర్ స్పందించిన తీరూ అపూర్వం. గురువారం మధ్యాహ్నం కంకిపాడు సినిమా హాలు సెంటర్ వద్ద రోడ్డుపై సడన్ గా వస్తున్న చిన్నారిని గుర్తించిన బస్సు డ్రైవర్ వెంటనే బ్రేక్ వేసి ప్రమాదాన్ని నివారించాడు. ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపగా, డ్రైవర్ అప్రమత్తతకు నెటిజన్లు అభినందనలు తెలిపారు.