ఉయ్యూరులో ఆదివారం "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమం జరిగింది. 5వ వార్డులో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ వివరించారు. తల్లికి వందనం, దీపం, అన్న క్యాంటీన్ పునరుద్ధరణ, యువతకు ఉద్యోగాలు వంటి కార్యక్రమాలతో చంద్రబాబు పాలన కొనసాగుతున్నట్లు తెలిపారు.