కానూరు తాడిగడప మున్సిపాలిటీ రామానగర్ కట్ట నుంచి తాడిగడప వంతెన వరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొని, ఇంటింటికి వెళ్లి ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. పేదల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా ఉపయోగించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.