Mar 03, 2025, 00:03 IST/
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
Mar 03, 2025, 00:03 IST
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. గత నెల 27న జరిగిన ఎన్నికలకు ఇవాళ ఫలితాలు వెల్లడించనున్నారు. ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత ఒక్కో అభ్యర్థికి లభించిన మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. 50 శాతం ఓట్లు వచ్చిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. అలా జరగకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.