విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని డీఎస్పీ రామాంజి నాయక్, సిఐలు సురేష్ కుమార్ రెడ్డి, ఓబులేసులు, అన్నారు. గురువారం పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఎస్సై ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరంలో పోలీసులతో పాటు పలువురు రక్తదానం చేయక ఆసుపత్రి ఆవరణంలో మొక్కలు నాటారు.