తిరువూరు సర్కిల్ పరిధిలోని విస్సన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో వేమిరెడ్డిపల్లి తండా నూతిపాడు మధ్య 1350, తాతకుంట్ల అమ్మవారి చెరువు వద్ద 1000, చుండ్రు పట్ల తండాలో 700, ఏ కొండూరు మండలం కుమ్మరి కుంట్ల తండాలో 150 లీటర్లు, మొత్తం మూడు వేల రెండు వందల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లుగా ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.