ఏ. కొండూరులో గాలి దుమ్ము బీభత్సం

71చూసినవారు
ఏ. కొండూరులో గాలి దుమ్ము బీభత్సం
ఎ. కొండూరు మండలం పోలిశెట్టిపాడు, మారేపల్లి గ్రామాలలో ఆదివారం రాత్రి గాలి, దుమ్ము బీభత్సంసృష్టించింది. చాలా చోట్ల స్తంభాలు, చెట్లు ఎక్కడికక్కడే విరిగిపోయాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అకాల వర్షం రావడంతో జనం ఎండ వేడిమితో కొంత ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్