ఐదు అడుగుల త్రాచుపాము కలకలం

63చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేట లో అష్టలక్ష్మి గుడిదగ్గర ఉంటున్నటువంటి పోకల కృపారావు ఇంట్లో ఐదున్నర అడుగుల తాచుపాము మంగళవారం రాత్రి ఇంటిలోకి చొరబడింది. ఈ విషయమై స్థానిక జనసేన నాయకులు ఉయ్యూరు జయప్రకాష్ కు సమాచారం అందించడం జరిగింది. వెంటనే ఆ సర్పాన్ని బంధించి సురక్షితంగా అడవిలో వదిలేసారు. విష సర్పం నుండి కాపాడినందుకు కృపారావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్