తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల గంపలగూడెం మండలం ఆర్లపాడులో అంబేడ్కర్ కాలనీ సమీపంలో గల జగనన్న కొత్త కాలనీలో అంధకారం అలుముకుంది. వీధి దీపాలకు కరెంటు స్థంభాలు వేసి ఆరు నెలలుగడుస్తున్నా కరెంటు సప్లై ఇవ్వలేదు. కాలనీకి సమీపంలో పంట పొలాలు ఉండటం వల్ల విష సర్పాలు, తేళ్ళు ,మండ్రగబ్బలు ప్రత్యక్షమతున్నాయి. ఇకనైనా అధికార్లు కళ్ళు తెరిచి కాలనీకి విద్యుత్ సరఫరా చేయాలని కాలనీవాసులు శనివారం కోరుతున్నారు.