గంపలగూడెం మండలం పెనుగొలను సాయిబాబా మందిరంలో జూలై 10న గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ సత్య సాయి బాబా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. దీపోత్సవం, అన్నాభిషేకం, గురువులకు సన్మానం, ధునిపూజ, పల్లకీసేవ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. భక్తులు పెద్దఎత్తున హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.