సైబర్ నేరాలపై అవగాహన సమావేశం

77చూసినవారు
సైబర్ నేరాలపై అవగాహన సమావేశం
స్మార్ట్ ఫోన్స్ ను అతిగా వినియోగిస్తూ, తెలియని యాప్స్ ను ఓపెన్ చేసి, సైబర్ నేరగాళ్ళ వలలో పడవద్దని ఆంగ్ల భాషా ఉపాధ్యాయ సంఘ కన్వీనర్ యం. రాం ప్రదీప్ సూచించారు. శుక్రవారం తిరువూరులోని ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలు -తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై మాట్లాడారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను నడిపే వారితో జాగ్రత్తగా ఉండాలని, ఆన్లైన్ గేమ్స్ తో డబ్బులు పోగుట్టుకునే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్