పెనుగొలను‌లో విప్లవకారుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి

51చూసినవారు
పెనుగొలను‌లో విప్లవకారుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి
గంపలగూడెం మండలం పెనుగొలనులో బుధవారం సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి 30 సంవత్సరాల చిన్న వయసులో ఉరి తీయబడిన రామ్ ప్రసాద్ బిస్మిల్ గొప్ప దేశభక్తిపరుడని సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్