పెనుగొలనులో ప్రముఖ కవి పింగళి జయంతి

82చూసినవారు
పెనుగొలనులో ప్రముఖ కవి పింగళి జయంతి
గంపలగూడెం మండలం పెనుగొలనులో శుక్రవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ కవి పింగళి లక్ష్మీకాంతం జయంతి నిర్వహించారు. పలువురు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పింగళి ఆంధ్ర సాహిత్య చరిత్ర, సాహిత్య శిల్ప సమీక్ష, ఆంధ్ర వాజ్మయచరిత్ర, గౌతమ నిఘంటువు మొదలైన గొప్ప గ్రంథాలు రచించారని తెలిపారు. రంగస్థల నటుడు, విశ్వవిద్యాలయం ఆచార్యుడు, ఆకాశవాణి కేంద్రం సలహాదారుడుగా రాణించారని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్