తిరువూరు క్లస్టర్ పరిధిలో గల గంపలగూడెం మండలం పోలిశెట్టిపాడు గ్రామంలో గురువారం రాత్రి పాల రైతులకు బోనస్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరువూరు పాలసితలీకరణ మేనేజర్ సాంబశివమూర్తి, యూనియన్ సభ్యులు మిద్దె నాగేశ్వరరావు చేతుల మీదుగా 2024, 25 సంవత్సరాలకు గాను లాభాల్లో మూడు లక్షల 34 వేల 750 రూపాయలు పాల రైతులకు బోనస్ పంపిణీ చేసినట్లు మేనేజర్ తెలిపారు. పాల రైతులకు యూనియన్ వెన్నుదన్నుగా ఉంటుందని అన్నారు.