తిరువూరు ఎక్సైజ్ శాఖ పరిధిలోని విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామంలో ఎక్సైజ్ శాఖ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పాత ముద్దాయిలపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు తిరువూరు ఎక్సైజ్ ఎస్సై వి. కృష్ణవేణి తెలిపారు. అక్రమ మద్యం తయారు చేసిన అమ్మిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.