తిరువూరు నియోజకవర్గ పరిధిలోని తిరువూరు మండలం చింతలపాడు గ్రామంలో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. గ్రామాల్లోని ప్రధాని రహదారిపై కోళ్ల వ్యాన్, బైకు ఎదురెదురుగా వచ్చి ఢీకొనట్లుగా స్థానికులు చెప్పుకుంటున్నారు. కొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓచర్ అనే అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళుతూ, గాయపడినట్లుగా ఎస్సై కెవి జెవి సత్యనారాయణ తెలిపారు.