తిరువూరు నియోజకవర్గంలో ఏ కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులకు కోసం ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్, కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని, కృష్ణా జలాల కోసం వేస్తున్న పైపులైన్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిషా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. డయాలసిస్ సెంటర్ లో కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ప్రభుత్వం నుండి వస్తున్న సదుపాయాలు అన్ని సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలపై తెలుసుకున్నారు.