గంపలగూడెం మండలం జింకల పాలెం అంగన్వాడిలో గురువారం సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పేద మహిళల విద్య కోసం విశేషమైన కృషి చేసిన జ్యోతిరావు పూలే గొప్ప మానవతావాదని సాయిబాబా సేవా కమిటీ సభ్యులు తెలిపారు. విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, అంగన్వాడి టీచర్ షేక్ మీరాబీ తదితరులు పాల్గొన్నారు.