గంపలగూడెం కృష్ణవేణి స్కూల్ లో శనివారం ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నదులపై అనేక ఆనకట్టలు, వంతెనలు కట్టిన మహోన్నత వ్యక్తి విశ్వేశ్వరయ్య అని ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.