తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం సచివాలయ, ఆరోగ్య, అంగన్వాడి సిబ్బంది ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు అందజేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఈరోజు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు.