తిరువూరు నియోజకవర్గ పరిధిలో గత రెండు రోజులుగా ఈదురు గాలులతో కురుస్తున్న వర్షాలకు ఏ. కొండూరు మండలంలో పడిపోయిన వరి పంటను కల్లాలలో తడిసిపోయిన ధాన్యాన్ని ఆర్డిఓ కే మాధురి బుధవారం పరిశీలించారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారులు ఎవరు తమ వద్దకు రావటం లేదని, పంట నష్టం అంచన వేయటం లేదని రైతులు ఆమెకు వివరించారు. తడిసిన ధాన్యం కొనటానికి ఎవరు ముందుకు రావటం లేదని ఆర్డీవో ముందు రైతులు వారి ఆవేదన వ్యక్తపరిచారు