అగ్నిమాపక వారోత్సవాలను విస్సన్నపేట అగ్నిమాపక సిబ్బంది మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని, పలు కోచింగ్ సెంటర్ల వద్ద విద్యార్థులకు అగ్ని ప్రమాద జాగ్రత్తలపై అవగాహన కల్పించి, డెమో నిర్వహించారు. అనంతరం బస్టాండ్, ఎన్టీఆర్ కాలనీలలో కరపత్రాలు పంచుతూ ప్రజలకు జాగ్రత్తలు తెలిపారు. కార్యక్రమంలో, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.