గంపలగూడెం మండలం పెనుగొలను లో శుక్రవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, జనసంఘ్ పార్టీ అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడుగా వాజ్ పాయ్ సమర్థవంతంగా పనిచేశారని సాయిబాబా కమిటీ సభ్యులు తెలిపారు.