గంపలగూడెం మండలం పెనుగొలను లో శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు డెంటల్, షుగర్ బీపీ జనరల్ మొదలైన రోగులను 200 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సత్య సాయి బాబా సేవ కమిటీ సభ్యులు వెదురు వెంకటరెడ్డి, సుగ్గల హనుమంతరావు, సముద్రాల వెంకటేష్ ఏర్పాట్లును పర్యవేక్షించారు.