గంపలగూడెం మండలంపెనుగొలను లో ఆదివారం శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో వైద్యులు డెంటల్, షుగర్,బిపి,ఎముకల,చిన్నపిల్లలు, జనరల్ మొదలైన170 రోగులను పరీక్షించారు. అవసరమైన వారికి ఉచితంగా మందుల అందజేశారు.ఈ కార్యక్రమంలో వైద్యులు కె వి వి సత్యనారాయణమూర్తి, ఏ ఎస్ ఎస్ ప్రసాద్ రావు, బి వెంకటరమణ, బహుదూర్ పాల్గొన్నారు.