గంపలగూడెం మండలం పెనుగొలనులోని ప్రగతి పబ్లిక్ స్కూల్ లో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీ ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో డెంటల్, షుగర్, బిపి , జనరల్ మొదలైన రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తిరువూరు శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ దామెర ప్రభాకర్ రావు శుక్రవారం తెలిపారు.