తిరువూరులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

63చూసినవారు
తిరువూరులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
తిరువూరు లో ఆదివారం ‌జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బి. పి, షుగర్ 950మందిరోగులను పరీక్షించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. మందుల వాడకం తోనే వ్యాధులు నియంత్రణలో ఉండవని సరైన ఆహార నియమాలు పాటించాలని వైద్యులు సూచించారు.  జనవిజ్ఞాన వేదిక నాయకులు  హరికృష్ణ, సుధాకర్,పాపారావు,లక్ష్మణరావు తదితరులు ఏర్పాటులను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్