తిరువూరు మండలం ఆంజనేయ పురం గ్రామంలో విజయవాడ హస్పటల్ సౌజన్యంతో గ్రామ సర్పంచ్ మామిడి కుటుంబరావు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలువు రోగులకు ఉచిత వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ శిరీష , జనరల్ డాక్టర్ శ్వేత, బంకా నవీన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.