గంపలగూడెం: అంగన్వాడీ చిన్నారులకు తులాభారం

57చూసినవారు
గంపలగూడెం మండలం పెనుగొలనులో 99వ అంగన్వాడి కేంద్రం చిన్నారులకు గురువారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో తులాభారం వేశారు. హాజరు ఎక్కువగా ఉన్న ఇద్దరు చిన్నారులకు ఈ తులభారం నిర్వహించారు. వారికి బియ్యం, బెల్లం, పుస్తకాల కిట్టు, కాయకూరలు అందజేశారు. రంగనాయక స్వామి ఆలయ అర్చకులు తుమాటి యోగానందా చార్యులు సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు నారాయణరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్