గంపలగూడెం మండలం పెనుగొలనులో మంగళవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పైడిమర్రి గొప్ప దేశభక్తిపరుడని, భారతదేశం నా మాతృభూమి అని ప్రతిరోజు స్కూల్లో చెప్పే ప్రతిజ్ఞ రచించారన్నారు.