గంపలగూడ మండలంలోని పెనుగొలనులో శనివారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. స్వతంత్య్ర ఉద్యమంలో లాల్ బహుదూర్ శాస్త్రి చేసిన పోరాటాలను గుర్తు చేశారు.