గంపలగూడెం మండలం పెనుగొలను లో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జ్ఞానపీఠపురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయణరెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నారాయణరెడ్డి తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన గొప్ప కవి అని ఎన్నో పద్య, గేయ కావ్యా లు , వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, బుర్రకథలు , విమర్శన గ్రంథాలు రాశారని పలువులు తెలిపారు.