గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం శివారు చిన కొమిరఅంగన్వాడీలో గురువారం అక్షరాభ్యాసం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అంగన్వాడి టీచర్ ఏ. ఉషా రాణి, పాఠశాల ఉపాధ్యాయులు జి. కోటేశ్వరరావు చిన్నారులు చెయ్యి పట్టుకుని అక్షరాలు దిద్దించారు. ముందుగా అంగన్వాడి సిబ్బంది అంగన్వాడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడీలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.