గంపలగూడెం: ఆడపిల్లలను రక్షించండి-ఆడపిల్లలకు చదువు చెప్పండి

52చూసినవారు
గంపలగూడెం: ఆడపిల్లలను రక్షించండి-ఆడపిల్లలకు చదువు చెప్పండి
గంపలగూడెం మండలం చిన్న కొమిరలో శుక్రవారం 'ఆడపిల్లలను రక్షించండి- ఆడపిల్లలకు చదువు చెప్పండి' అనే కార్యక్రమం నిర్వహించారు. యుక్త వయస్సు బాలికలకు చదువు యొక్క ప్రాముఖ్యత, బాల్య వివాహాల వలన నష్టాలు గురించి అవగాహన కల్పించారు. అబ్బాయికి 21, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి అధికారి మోదుగు శివరావు, అంగన్వాడీ కార్యకర్తలు మోదుగు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్