గంపలగూడెం: రేషన్ బియ్యం పట్టివేత

69చూసినవారు
గంపలగూడెం: రేషన్ బియ్యం పట్టివేత
గంపలగూడెం మండలం నెమలి గ్రామ శివారులో తెలంగాణ నుండి ఆంధ్రకు ఐసర్ లారీలో తరలిస్తున్న 7 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఐసర్ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జయంతి గ్రామానికి చెందిన రేషన్ డాన్ కాజా రామారావుకు చెందిన అక్రమ రేషన్ బియ్యాన్ని గంపలగూడెం పోలీసులు పట్టుకున్నారు. సన్నబియ్యం పేరిట తెలంగాణ నుండి ఆంధ్రకు రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్