గంపలగూడెం: తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు

7చూసినవారు
గంపలగూడెం: తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు
గంపలగూడెం మండలం పెనుగొలను బోటిమీద కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు వేంకటేశ్వర స్వామి, ఆలయ కమిటీ ఆర్గనైజర్ పరుచూరు హరిమాధ గుప్తా ఆధ్వర్యంలో శ్రీ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత నరసింహ స్వామి కి‌ పండ్లరసాలతో అభిషేకం చేసి అలంకరణ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న వైష్ణవాలయాల్లో తొలి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్