గంపలగూడెం మండలం పెనుగొలను బోటి మీద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రాంగణంలో ఆదివారం జంట నాగుల విగ్రహ ప్రతిష్ట వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులుదాములూరు సత్యనారాయణ శర్మ, వేద పండితులు శివయ్య శాస్త్రి, వంశీకృష్ణ చార్యులు ముందుగా గణపతి పూజ , సర్ప సూక్త నక్షత్ర హోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో 36 జంట నాగులు విగ్రహ ప్రతిష్ట జరిగినట్టు ఆలయ నిర్వాహకులు వూటుకూరు నారాయణరావు తెలిపారు.