గంపలగూడెం మండలం నుండి అక్రమంగా తెలంగాణకు ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లు సీజ్ చేసిన పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఎలాంటి అనుమతులు లేకుండా యదేచ్చగా తెలంగాణకు ఇసుక తరలిస్తున్నారు. అదేవిధంగా కేసు నమోదు చేసి 3 ట్రాక్టర్లను సీజ్ చేశామన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు.