గంపలగూడెం మండలం పెనుగొలను 99వఅంగన్వాడి కేంద్రంలో శుక్రవారం జాతీయ సురక్షిత మాతృత్వదినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ కె. లింగమ్మ జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమం ప్రాముఖ్యత ను వివరించారు. అంగన్వాడి ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, లబ్ధిదారులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.