గంపలగూడెంలో సోమవారం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా అవగాహనపై భారీ ర్యాలీ నిర్వహించారు. నేటి సమాజానికి యోగా ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలు వేసి ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ, పంచాయతీ, ఆరోగ్య శాఖల ఉద్యోగస్తులు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, మహిళలు, వివిధ రంగాలు చెందిన ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.